ఇంగ్లాండ్లో జరుగుతున్న మహిళా క్రికెట్ సూపర్ లీగ్లో భారత క్రీడాకారిణీలు మెరిశారు. టీమిండియా టీ20 జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఈ టోర్నీలో మంధానకిది వరుసగా రెండో హాఫ్ సెంచరీ.
వెస్టర్న్ స్టోర్మ్ తరఫున ఆడుతున్న మంధాన.. లాంకషైర్ థండర్తో జరిగిన మ్యాచ్లో 43 బంతుల్లో 72 పరుగులు చేసి సత్తాచాటింది. ఇందులో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఫలితంగా స్టోర్మ్ జట్టు విజయం సాధించింది. ముందు మ్యాచ్లో 47 బంతుల్లో 70 పరుగులు చేసిందీ భారత క్రికెటర్.
భారత మహిళా టీ20 జట్టు సారథి హర్మన్ ప్రీత్ అర్ధసెంచరీతో మెరిసింది. మంధాన ప్రత్యర్థి జట్టు లాంకషైర్ తరఫున ఆడిన ఈ క్రికెటర్ 50 పరుగులు చేసింది. అయినా జట్టును గెలిపించలేకపోయింది.