తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టు సిరీస్​ ముందు విండీస్​కు షాక్​... కీమో పాల్ దూరం

ఆంటిగ్వా వేదికగా టీమిండియాతో తొలి టెస్టుకు సిద్ధమవుతోన్న విండీస్​ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. వెస్టిండీస్ ఆల్​రౌండర్ కీమో పాల్​ ​చీలమండల గాయం కారణంగా​ మొదటి మ్యాచ్​కు దూరమయ్యాడు. అతడి స్థానంలో మిగ్వెల్​ కమిన్స్​ బరిలోకి దిగనున్నాడు.

కీమో పాల్

By

Published : Aug 22, 2019, 5:36 PM IST

Updated : Sep 27, 2019, 9:41 PM IST

టీమిండియాతో సుదీర్ఘ సిరీస్​కు సిద్ధమవుతోన్న విండీస్​ జట్టుకు షాక్​ తగిలింది. ఆ దేశ ఆల్​రౌండర్ చీలమండల గాయం కారణంగా తొలి టెస్టు​కు దూరమయ్యాడు. అతడి స్థానంలో మిగ్వెల్ కమిన్స్ రానున్నాడు. ఈ విషయాన్ని విండీస్​ కోచ్​ అధికారికంగా ప్రకటించాడు.

"గాయం కారణంగా కీమో పాల్​ మ్యాచ్​కు విశ్రాంతినిచ్చాం. మిగ్వెల్ జట్టులోకి రానున్నాడు. అతడి అనుభవం జట్టుకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం".

- ప్లయడ్ రీఫర్​, విండీస్ కోచ్​

ఆరంభంలోనే సంచలనం...

మూడేళ్ల క్రితం భారత్​లో జరిగిన టెస్టు మ్యాచ్​లో అరగేట్రం చేశాడు మిగ్వెల్. అతడు బరిలోకి దిగిన రెండో మ్యాచ్​లో కేవలం 48 పరుగులే ఇచ్చి 6 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

ఆంటిగ్వాలోని వివ్​ రిచర్డ్స్​ మైదానంలో భారత్​-విండీస్​ మధ్య నేటి నుంచి మొదటి టెస్టు జరగనుంది. సాయంత్రం ఏడు గంటల నుంచి ఆట ప్రారంభం కానుంది. ఈ సిరీస్​లో గెలిచి టెస్టు ఛాంపియన్​షిప్​ను ఘనంగా ప్రారంభించాలనే యోచనలో ఉన్నాయి ఇరుజట్లు.

ఇది చదవండి: రోహిత్​ను ఆ స్థానంలోనే ఆడించాలి: సెహ్వాగ్​

Last Updated : Sep 27, 2019, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details