బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీలను మెల్‌బోర్న్‌లో ఈ హీరోయిన్ ఆవిష్కరించనుంది. పురుషులు టోర్నీ అక్టోబర్ 18న ప్రారంభంకానుండగా, మహిళల టోర్నీ ఫిబ్రవరి 21న మొదలుకానుంది.
"ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగస్వామ్యం కావడం పట్ల గౌరవంగా భావిస్తున్నా. ఆయా దేశాల తరఫున ఆడుతున్న మహిళలందరినీ నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. అంతర్జాతీయ వేదికపై వారు రాణించడాన్ని చూడటం నిజంగా చాలా శక్తినిస్తుంది. వారు మనందరికీ స్ఫూర్తిదాయకం. భారత క్రికెట్ జట్టు తరఫున ఆడిన గొప్ప క్రికెటర్లలో దివంగత మా మామగారు ఒకరు."
-కరీనా కపూర్, బాలీవుడ్ హీరోయిన్