తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ద ఎండ్' అంటోన్న స్పీడ్ స్టార్ బుమ్రా

టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని బౌలింగ్ ప్రాక్టీసు చేస్తున్నాడు. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

Jasprit Bumrah
బుమ్రా

By

Published : Nov 27, 2019, 1:34 PM IST

టీమిండియా పేసర్​ జస్ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలతో అభిమానులకు ఎప్పటికప్పుడూ అప్​డేట్స్ ఇస్తున్నాడు. తాజాగా ఓ ఫొటోను పంచుకుని, త్వరలో మైదానంలో అడుగుపెట్టబోతున్నట్లు సూచనిచ్చాడు.

ఆ ఫోటోలో మిడిల్ స్టంప్ విరిగిపోయి ఉంది. దానికి తోడు "ద ఎండ్" అంటూ ఓ వ్యాఖ్య రాసుకొచ్చాడు.

బుమ్రా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. "బుమ్రాకు సుస్వాగతం, న్యూజిలాండ్ సిరీస్‌లో నిన్ను చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాం" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మరో అభిమాని "బూమ్‌ బూమ్‌ బుమ్రా.. మిడిల్‌ స్టంప్‌నే లక్ష్యంగా చేసుకుని సాధన చేస్తున్నావు" అని అన్నాడు.

వెన్నెముక గాయం కారణంగా బుమ్రా.. స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీస్‌లకు దూరమయ్యాడు. వచ్చే జనవరిలో జరిగే న్యూజిలాండ్‌ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

బుమ్రా ట్వీట్

ఇవీ చూడండి.. విండీస్​తో టీ20లకు ధావన్ స్థానంలో శాంసన్

ABOUT THE AUTHOR

...view details