లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన క్రికెటర్లందరూ.. తమకిష్టమైన వ్యాపకాలతో బిజీగా గడుపుతున్నారు. అయినప్పటికీ తాము ఆటకు దూరంగా ఉండటం విచారంగా ఉందంటూ పలు సందర్భాల్లో వాపోతున్నారు. గతంలో వారి మ్యాచ్‌లు ఆడిన సందర్భంలోని ఆసక్తికరమైన విశేషాలను.. వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా టీమ్ఇండియా స్పిన్నర్ జస్ప్రిత్ బుమ్రా తనకు సంబంధించిన ఓ త్రో బ్యాక్ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. తాను మార్నింగ్ ట్రైనింగ్ సెషన్స్‌ను ఎంతగానో మిస్ అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ వీడియోలో అతడు మైదానంలో వ్యాయామంలో భాగంగా పరుగెత్తుతూ కనిపించాడు. "మార్నింగ్ ట్రైనింగ్ సెషన్స్‌ను మిస్సవుతున్నా" అంటూ వ్యాఖ్య జోడించాడు.