తెలంగాణ

telangana

ETV Bharat / sports

పొలార్డ్​కు జరిమానా.. ఓ డీమెరిట్ పాయింట్​ - demerit

వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ కీరన్​ పొలార్డ్​కు జరిమానా విధించింది ఐసీసీ. భారత్​తో జరిగిన రెండో టీ20లో దుష్ప్రవర్తన కారణంగా మ్యాచ్​ ఫీజులో 20 శాతం కోత పెట్టింది. మ్యాచ్​లో అంపైర్​ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు ఓ డీమెరిట్​ పాయింట్​ను ఖాతాలో వేసింది.

పొలార్డ్​

By

Published : Aug 6, 2019, 4:41 PM IST

Updated : Aug 6, 2019, 7:55 PM IST

వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ కీరన్​ పొలార్డ్​కు మ్యాచ్​ ఫీజులో 20 శాతం జరిమానా విధించిన ఐసీసీ... ఓ డీమెరిట్​ పాయింట్​నూ అతడి ఖాతాలో వేసింది. ఫ్లోరిడా వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో దుష్ప్రవర్తనకు పాల్పడడమే ఇందుకు కారణమని తెలిపింది.

" ఐసీసీ నియమావళిలోని నిబంధన 2.4ను పొలార్డ్​ అతిక్రమించాడు. పోలార్డ్​ ఆట మధ్యలో సబ్​స్టిట్యూట్​ను మైదానంలోకి పిలిచాడు. ఓవర్​ పూర్తయ్యేవరకు ఆగాలని అంపైర్లు సూచించినా పట్టించుకోలేదు. వారి ఆదేశాలను బేఖాతరు చేసి నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించాం. మ్యాచ్​ అనంతరం రిఫరీ జెఫ్​ క్రో ముందు హాజరైన పొలార్డ్​ తప్పును అంగీకరించలేదు. అతడి చర్యలకు శిక్షగా మ్యాచ్​ ఫీజులో 20 శాతం కోత విధించాం. ఓ డీమెరిట్​ పాయింట్ కూడా అతడి​ ఖాతాలో చేరుస్తున్నాం"
-- ఐసీసీ ప్రకటన

రెండు సంవత్సరాల కాలంలో ఎవరైనా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్​ పాయింట్లు పొందితే... వారిపై కొంత కాలం నిషేధం పడుతుంది. రెండు పాయింట్లు వస్తే ఒక టెస్టు/ రెండు వన్డేలు/ రెండు టీ20ల్లో వేటు పడుతుంది. నిషేధం ఎదుర్కొన్నా ఈ పాయింట్లను రెండేళ్ల పాటు అతడి ఖాతాలోనే ఉంచుతారు.

కరీబియన్​ జట్టుపై రెండో టీ20లో విజయం సాధించిన భారత జట్టు 2-0 తేడాతో సిరీస్​ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్​లో డక్​వర్త్​ లూయిస్​ ప్రకారం 22 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా.

ఇది చదవండి: స్మిత్​ రీఎంట్రీ హిట్​పై సచిన్​ రియాక్షన్​

Last Updated : Aug 6, 2019, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details