తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైరల్​: జడ్డూ క్యాచ్​.. బ్యాట్స్​మన్ షాక్​

టీమిండియా బౌలర్​ రవీంద్ర జడేజా మరోసారి తన అద్భుత ఫీల్డింగ్​తో ఆశ్చర్యపరిచాడు. తన బౌలింగ్​లో మర్కరమ్​ ​(39) ఇచ్చిన క్యాచ్​ను కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

జడేజా

By

Published : Oct 6, 2019, 6:18 PM IST

టీమిండియా జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరంటే.. తడుముకోకుండా ఎక్కువ మంది చెప్పే పేరు రవీంద్ర జడేజా. మైదానంలో వేగంగా కదులుతూ అసాధారణ క్యాచ్​లతో జట్టు విజయంలో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించాడు. తాజాగా విశాఖలో జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన క్యాచ్ అందుకొని మరోసారి ఔరా అనిపించాడు జడ్డూ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​ అవుతోంది.

ఆదివారం జరిగిన తొలి టెస్టు చివరిరోజు ఆట​లో దక్షిణాఫ్రికా ఆటగాడు అయిడెన్ మర్కరమ్​ (39) క్యాచ్​ను కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు జడేజా. 26వ ఓవర్ జడ్డూ వేయగా.. తొలి బంతిని బౌలర్​వైపు ఆడాడు మర్కరమ్​. వేగంగా తన వైపునకు వస్తున్న బంతిని హఠాత్తుగా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు జడేజా. తన ఔట్​ను నమ్మలేక ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయాడు ఆ సఫారీ బ్యాట్స్​మెన్​​.

ఈ మ్యాచ్​లో జడ్డూ 6వికెట్లు తీశాడు. మర్కరమ్​​ను ఔట్ చేసిన ఓవర్లోనే నాలుగో బంతికి ఫిలాండర్​(0), ఐదో బంతికి కేశవ్​ మహరాజ్​(0)ను పెవిలియన్​ చేర్చాడు. ఈ మ్యాచ్​లో టీమిండియా 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఇదీ చదవండి: రికార్డు: విశాఖ టెస్టు.. సిక్సర్లలో బెస్టు

ABOUT THE AUTHOR

...view details