కరోనా వైరస్‌పై పోరాటంలో వైద్యులు, పోలీసులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇక పోలీసులు విధి నిర్వహణలో తీరికలేక రోడ్లపైనే భోజనం, విశ్రాంతి తీసుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
యువరాజ్ హృదయాన్ని కదిపిన వీడియో - యువరాజ్
కరోనాపై పోరాటంలో వైద్యుల, పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమైంది. వీరితోపాటు పోలీసుల కృషి వెలకట్టలేనిది. టీమ్ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తాజాగా ట్వీట్ చేసిన వీడియో అందుకు నిదర్శనం.
యువరాజ్ హృదయాన్ని కదిపిన వీడియో
అయితే టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ తాజాగా పోలీసుల మానవత్వాన్ని చాటే ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీనిలో పోలీసులు తమ సొంత ఆహారాన్ని ఓ యాచకుడికి అందించారు. "పోలీసులు చూపించిన మానవత్వం నా మనసును హత్తుకుంది. ప్రస్తుత క్లిష్ట సమయాల్లో సొంత ఆహారాన్ని అందివ్వడం వారి దయకు నిదర్శనం. దీంతో వారిపై మరింత గౌరవం పెరిగింది" అని యువీ పోస్ట్ చేశాడు.
ఇదీ చూడండి..'రోహిత్ శర్మ అటతీరు అతడిని గుర్తుచేసింది'