తెలంగాణ

telangana

ETV Bharat / sports

హెల్మెట్, గార్డ్​.. క్రికెట్​లో ఏది ముందు వాడారో తెలుసా?

హెల్మెట్, క్రికెట్ గార్డ్... ఈ రెండింటిలో ఏది ముందు వాడారో తెలుసా? 1874లోనే గార్డ్​ను ఉపయోగించగా.. దాదాపు వందేళ్ల అనంతరం శిరస్త్రాణాన్ని వినియోగించడం ప్రారంభించారు.

It took 100 years for men to realize that the brain is also important
హెల్మెట్ - గార్డ్​

By

Published : Jan 2, 2020, 2:32 PM IST

యుద్ధంలో సైనికుడికి కత్తి ఎంత అవసరమో.. క్రికెట్​లో బ్యాట్స్​మన్​కు బ్యాట్​ అంతే ముఖ్యం. దీంతో పాటు ఇంకో రెండు వస్తువులు కూడా ఎంతో కీలకం! అందులో ఒకటేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదే జాక్​స్ట్రాప్​.. మన భాషలో చెప్పాలంటే గార్డ్​. రెండోది హెల్మెట్. అయితే ఈ రెండింట్లో ఏది ముందు ఉపయోగించారో తెలుసా! రెండూ ఒకేసారి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ముందుగా గార్డ్​ను వినియోగించారు.

గార్డ్​ను 1874లో తొలిసారి ఉపయోగించారు. హెల్మెట్​ మాత్రం ఆలస్యంగానే వినియోగంలోకి వచ్చింది. ఆ ఆలస్యం ఎంతంటే... దాదాపు వందేళ్లు. 1970వ దశకం వరకు క్రికెట్లో హెల్మెట్​ను వాడలేదు. మొదటగా వరల్డ్ సిరీస్ క్రికెట్​లో డెన్నిస్ అమీస్ అనే ఆటగాడు భద్రత కోసం మొదటిసారి శిరస్త్రాణాన్ని ఉపయోగించాడు. అయితే అంతర్జాతీయ మ్యాచ్​ల్లో మాత్రం 1978 నుంచి వాడుకలోకి వచ్చింది. ఆస్ట్రేలియా ఆటగాడు గ్రాహమ్ యాల్లోప్ తొలిసారి హెల్మెట్ ధరించి మ్యాచ్ ఆడాడు.

ప్రస్తుతం హెల్మెట్, గార్డ్​కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఔత్సాహికులు చర్చించుకుంటున్నారు. ఈ రెండింటికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. క్రికెట్​లో హెల్మెట్ అవసరం గురించి వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు నెటిజన్లు. మెదడు కూడా ముఖ్యమని తెలుసుకోవడానికి వందేళ్లు పట్టింది అని ఫొటో షేర్ చేశారు.


ఇదీ చదవండి: హీరో విశాల్​తో గుత్తాజ్వాల డేటింగ్.. ఫొటోలు వైరల్​!

ABOUT THE AUTHOR

...view details