తెలంగాణ

telangana

ETV Bharat / sports

రనౌట్ వదిలేసిన బౌలర్​పై ప్రశంసలు- ఎందుకు? - Isuru Udana opts not to run out injured batsman in MSL

ప్రత్యర్థి బ్యాట్స్​మన్​ గాయంతో బాధపడుతుండగా.. అతడిని రనౌట్ చేసే అవకాశమొచ్చినా విడిచిపెట్టి క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాడు శ్రీలంక బౌలర్ ఇసురు ఉడానా. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Isuru Udana opts not to run out injured batsman in MSL
రనౌట్ మిస్

By

Published : Dec 11, 2019, 2:24 PM IST

Updated : Dec 11, 2019, 2:44 PM IST

గాయపడిన వీరుడిపై అస్త్రాన్ని సంధించడం యుద్ధనీతికి విరుద్ధమన్నది జగమెరిగిన సత్యం. ఇదే విధానాన్ని అవలంబించి క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు శ్రీలంక బౌలర్ ఇసురు ఉడానా. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ జాన్సీ సూపర్​లీగ్​లో ఆడుతున్న ఇతడు ప్రత్యర్థి బ్యాట్స్​మన్ రన్ కోసం ప్రయత్నించి గాయపడ్డాడు. బంతి తనవద్దే ఉన్నప్పటికీ అతడిని ఔట్ చేయకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు.

జాన్సీ సూపర్​లీగ్​లో పెరల్ రాక్స్ - నెల్సన్ మండేలా బే జెయింట్స్ జట్ల మధ్య ఇటీవల మ్యాచ్ జరిగింది. రెండో ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బే జెయింట్స్ బ్యాట్స్​మెన్ హీనో కున్ - మార్కో మారియస్ క్రీజులో ఉన్నారు.

8 బంతుల్లో 24 పరుగులు రావాల్సిన తరుణంలో హీనో కున్ బంతిని బలంగా మోదాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్​లో ఉన్న మారియస్​కు ఆ బంతి తగలగా.. గాయంతో అక్కడే పడిపోయాడు. అప్పటికే క్రీజు దాటిన బ్యాట్స్​మన్​ను రనౌట్ చేయడం ఇసురు ఉడానాకు పెద్ద పనేం కాదు. చేతిలో బంతి ఉన్నప్పటికీ ఔట్ చేయకుండా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాడు.

అనంతరం ఫిజియో రంగంలోకి దిగి అతడికి ప్రథమ చికిత్స అందించాడు. చివరి ఓవర్ మూడో బంతిని సిక్సర్​ బాది జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు మార్కో. అయితే అప్పటికే చేయాల్సిన స్కోరు ఎక్కువ ఉంది. ఫలితంగా పెరల్ రాక్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో ఇసురు ఉడానా క్రీడాస్ఫూర్తికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'తప్పు చేశా.. తక్కువ శిక్ష పడుతుందని అనుకుంటున్నా'

Last Updated : Dec 11, 2019, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details