తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోడ్​ సేఫ్టీ సిరీస్​లో పాల్గొన్న ఇర్ఫాన్ పఠాన్​కు కరోనా ​ - ఇర్ఫాన్ పఠాన్

భారత మాజీ క్రికెటర్​ ఇర్ఫాన్ పఠాన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ.. కొవిడ్​ నిర్ధరణ అయ్యిందని వెల్లడించాడు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపాడు.

Irfan Pathan tests positive for COVID-19, fourth case from Road Safety World Series
రోడ్​ సేఫ్టీ సిరీస్​లో పాల్గొన్న మరో క్రికెటర్​కు కొవిడ్​

By

Published : Mar 29, 2021, 11:01 PM IST

Updated : Mar 29, 2021, 11:58 PM IST

రోడ్​ సేఫ్టీ సిరీస్​లో పాల్గొన్న మరో క్రికెటర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ తనకు కొవిడ్ పాజిటివ్​గా తేలిందని భారత మాజీ క్రికెటర్​ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. "ప్రస్తుతం క్వారంటైన్​లో ఉంటున్నాను. ఇటీవల నాతో సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నానని" ఇర్ఫాన్​ పేర్కొన్నాడు.

"దయచేసి ప్రతి ఒక్కరు మాస్క్​ ధరించండి. భౌతిక దూరం పాటించండి. అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా" అని ఇర్ఫాన్ తెలిపాడు. రోడ్​ సేఫ్టీ సిరీస్​లో పాల్గొన్న సచిన్​ తెందూల్కర్​తో పాటు యూసుఫ్​ పఠాన్, బద్రీనాథ్​కు​​ కూడా కొవిడ్​ పాజిటివ్​గా తేలింది.

ఇదీ చదవండి:'ధోనీ సారథ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా'

Last Updated : Mar 29, 2021, 11:58 PM IST

ABOUT THE AUTHOR

...view details