క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు ఒక్కొక్కొటిగా యూఏఈకి చేరుకుంటున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాళ్లు దుబాయ్‌కి చేరుకోగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ బృందం అబుదాబిలో అడుగుపెట్టింది. కరోనా నిబంధనల మేరకు వీరంతా ఆరురోజుల పాటు గదికే పరిమితం కానున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు బీసీసీఐ మార్గదర్శకాలను అనుసరించిన క్రికెటర్లు, తమ కార్యకలాపాలు సాగించారు.
బీసీసీఐ నిబంధనలు(ఎస్ఓపీ) ప్రకారం రాయల్స్ బృందం మొదటి రోజు కరోనా పరీక్షలను పూర్తి చేసుకోగా.. కింగ్స్‌ఎలెవెన్ పంజాబ్ శుక్రవారం మరోసారి టెస్టులకు వెళ్లింది. బోర్డు మార్గదర్శకాల మేరకు ఆటగాళ్లకు 1,3,6 రోజులలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. వీటన్నింటినీ దాటుకుని వచ్చిన జట్లు శిక్షణ ప్రారంభించనున్నాయి.