ఐపీఎల్ బజ్: ఆటగాళ్ల జోరు మాములుగా లేదుగా! - ఐపీఎల్ వార్తలు
ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకున్న తమ ఆటగాళ్ల గురించి ఆయా ఫ్రాంచైజీలు సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తాజా విశేషాలను పంచుకుంటున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 మరో పది రోజుల్లో మొదలవ్వనుంది. సమయం ఎక్కువగా లేకపోవడం వల్ల ఆటగాళ్లంతా విపరీతంగా సాధన చేస్తున్నారు. సీజన్‌పై ఆసక్తి పెరిగేందుకు ఫ్రాంఛైజీల సోషల్ మీడియా విభాగాలన్నీ వినూత్నంగా పోస్టులు పెడుతున్నాయి. అభిమానులు ఎక్కువగా ఇష్టపడే క్రికెటర్లకు సంబంధించిన సమాచారం ఇస్తున్నాయి. ముంబయి ఇండియన్స్ రోహిత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోహ్లీ, చెన్నై సూపర్‌కింగ్స్ ధోనీ, రాజస్థాన్ రాయల్స్ సంజు, దిల్లీ క్యాపిటల్స్ పంత్ చిత్రాలను పంచుకుంటున్నాయి. తాజాగా ఏ శిబిరం ఎలా ఉందో.. ఐపీఎల్ బజ్‌పై ఓ లుక్కేయండి...