ఐపీఎల్ బజ్: ఓవైపు సాధన.. మరోవైపు ఆస్వాదన - ఐపీఎల్ 2020
ఐపీఎల్ కోసం జట్లన్నీ యూఏఈ చేరుకుని సన్నాహాలు ప్రారంభించాయి. ఆటగాళ్లు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేశారు. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను నెట్టింట పోస్టు చేస్తున్నాయి. తాజాగా వారు షేర్ చేసిన పోస్టులపై ఓ లుక్కేద్దాం.

ఐపీఎల్ బజ్
ఐపీఎల్ 13వ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభంకానుంది. టోర్నీ కోసం క్రీడాభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మెగాలీగ్ కోసం యూఏఈ చేరుకున్న తమ అభిమాన ఆటగాళ్లు ఏమి చేస్తున్నారు? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అందుకే జట్ల యాజమాన్యాలు ఎప్పటికప్పడు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయా విశేషాలను పోస్ట్ చేస్తూనే ఉన్నాయి. మన ఆటగాళ్ల సాధనలు, కసరత్తులు, ఛలోక్తులు, సరదాలు అన్నింటినీ అభిమానులతో పంచుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఫ్రాంచైజీల తాజా పోస్టులపై ఓ లుక్కేద్దాం.
Last Updated : Sep 11, 2020, 4:39 PM IST