ఐపీఎల్ పాలక మండలి అనుమతిస్తే.. 14వ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌లను ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు నిర్వహించనున్నారు. అయితే.. మ్యాచ్‌లు నిర్వహించే వేదికలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే వారం జరిగే సమావేశంలో దీని గురించి చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పాలక కమిటీ సభ్యుడొకరు తెలిపారు.
ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ షురూ! - ఐపీఎల్ పాలక మండలి
ఐపీఎల్ 14వ సీజన్ మ్యాచ్‌లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. పాలక మండలి అనుమతిస్తే ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఈ మ్యాచ్‌ల నిర్వహణ జరగనుంది.
ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ షురూ!
ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ ఒకే వేదికగా నిర్వహించాలని పాలక కమిటీ భావిస్తోన్నప్పటికీ.. 4 నుంచి 5 నగరాల్లో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తోందని కమిటీ సభ్యుడు వివరించారు. దీనిపై తుది నిర్ణయం పాలక కమిటీలో చర్చించి తీసుకుంటామన్నారు. ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ వేదికలపై కూడా కమిటీ చర్చించిందని, ఆటగాళ్ల భద్రత కోసం బయో బబుల్ ఏర్పాట్లపై సన్నాహాలు చేస్తోందని తెలిపారు.
ఇదీ చదవండి:ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం- డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్