ముంబయి ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో మెప్పించాడు ఆర్సీబీ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. 28 బంతుల్లో 39 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే గతేడాది పంజాబ్‌కు ఆడిన ఇతడు 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇతడిని ఈ సీజన్‌కు ముందు వదులుకుంది పంజాబ్. ఆ తర్వాత వేలంలో మ్యాక్సీని భారీ ధరకు కొనుగోలు చేసింది బెంగళూరు. తాజాగా అతడు మొదటి మ్యాచ్‌లోనే సత్తాచాటడం వల్ల అతడి మాజీ జట్టుకు ఓ సందేశం పంపింది ఆర్సీబీ.
"ఆర్సీబీ తరఫున మొదటి సిక్సు. ఆ బంతి చెన్నై అవతల పడింది. థ్యాంక్యూ పంజాబ్ కింగ్స్. ఒకవేళ భౌతిక దూరం లేకుంటే మిమ్మల్ని కౌగిలించుకునే వాళ్లం" అంటూ పోస్ట్ చేసింది బెంగళూరు.