ఐపీఎల్‌కు ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 7 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్లో ఉండనున్నాడు. అదేంటీ ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లు నేరుగా తమ ఐపీఎల్ జట్లతో కలిసే అవకాశం బీసీసీఐ కల్పించిందిగా అని మీరు అనుకోవచ్చు. అది నిజమే.. కానీ, ఇంగ్లాండ్‌తో మ్యాచ్ తర్వాత రోజున ఏర్పాటు చేసిన బయో బబుల్ దాటి కోహ్లీ బయటికొచ్చాడు. దీంతో అతడు తప్పనిసరి క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 1 నుంచి చెన్నైలో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉండనున్నాడు.
ఇక కోహ్లీ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్‌ను మొదలెట్టాడు. ఇందుకు సంబంధించి వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. "విరామ రోజులు లేవు. ఇక ఇక్కడి నుంచి అంతా వేగంగా వెళ్తుంది" అని ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ అనంతరం బయో బబుల్ గురించి మాట్లాడాడు. బబుల్‌లో ఎక్కువ కాలం గడపడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ప్రతి ఒక్కరికి ఒకే రకమైన మానసిక పరిస్థితి ఉండదు. అని కోహ్లీ పేర్కొన్నాడు.