ఐపీఎల్‌కు కరోనా బ్రేక్.. వచ్చే నెలకు వాయిదా - CRICKET NEWS
14:35 March 13
మార్చి 29 బదులు ఏప్రిల్ 15న ప్రారంభం
కరోనా వైరస్ ప్రభావం క్రీడలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు టోర్నీలు వాయిదా పడగా మరికొన్ని రద్దయ్యాయి. తాజాగా భారత్‌లో నిర్వహించే ఖరీదైన క్రికెట్ లీగ్ ఐపీఎల్‌ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఐసీసీ ట్విట్టర్లో పేర్కొంది. ఈనెల 29కి బదులు వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానుందని రాసుకొచ్చింది.
రాష్ట్రాల విముఖత
కరోనా ప్రభావం వల్ల ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాల క్రికెట్ సంఘాలు విముఖత వ్యక్తం చేశాయి. మరికొన్ని ఆలోచనలో పడ్డాయి. కర్ణాటక, దిల్లీలో మ్యాచ్‌లను నిర్వహించే వీలులేదని అక్కడి ప్రభుత్వాల స్పష్టం చేశాయి. మహారాష్ట్ర అదే దారిలో ఉంది. అందువల్ల ఐపీఎల్‌ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.