దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది. అయితే ఈ మెగా లీగ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాల్సిన ఇంగ్లాండ్ క్రికెటర్ క్రిస్ వోక్స్ అందుబాటులో ఉండట్లేదు. భవిష్యత్త్ టోర్నీల మీద దృష్టి సారించేందుకు ఈ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. అయితే అతడి స్థానంలోకి దక్షిణాఫ్రికా పేసర్ ఎన్రిచ్ నోర్జ్టేను తీసుకుంది జట్టు యాజమాన్యం. ఈ విషయాన్ని దిల్లీ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.
ఈ లీగ్‌లో ఆడేందుకు తానెంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు ఎన్రిచ్. గతేడాది ఇతడు కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేయాల్సి ఉండగా.. భుజం గాయం వల్ల దూరమయ్యాడు.