తెలంగాణ

telangana

By

Published : Aug 23, 2020, 6:53 PM IST

ETV Bharat / sports

ఐపీఎల్​లో ఈసారి ఆరెంజ్​ క్యాప్​ ఎవరిది?

ఐపీఎల్ కొన్నిరోజుల్లో మొదలవుతుంది. బ్యాట్స్​మెన్, బౌలర్ల మధ్య ఆధిపత్యం కోసం తలపడనున్నారు. అయితే ఈ పోరులో గెలిచేది ఎవరు? ఎక్కువ పరుగులు చేసే బ్యాట్స్​మన్ ఎవరు? అలాంటి విషయాల సమాహారమే ఈ కథనం.

IPL 2020: 5 batsmen who can win the Orange Cap this season
ఐపీఎల్​

ఏ క్రికెట్​ అభిమానిని కదిలించినా వినిపిస్తున్న పేరు ఐపీఎల్​. మరికొద్ది రోజుల్లో టోర్నీ ప్రారంభం కానుంది. దీంతో ఎక్కడ చూసినా ఈ​ సందడే కనిపిస్తోంది. కరోనా లాక్​డౌన్​ తర్వాత జరుగుతున్న అతిపెద్ద లీగ్​ ఇదే కావడం వల్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పలు ఫ్రాంచైజీలకు చెందిన భారత ఆటగాళ్లందరూ దుబాయ్​ చేరుకున్నారు.

అయితే ఐపీఎల్​ అనగానే గుర్తొచ్చేది బ్యాట్స్​మెన్ భారీ షాట్లు. లీగ్​ ప్రారంభమైనప్పటి నుంచి బౌలర్లపై వారు పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ప్రతి సీజన్​లోనూ ఎక్కువ పరుగులు చేసి రికార్డులు నెలకొల్పిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఈ ఏడాది కూడా తమ హిట్టింగ్​తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్​లో ఆరెంజ్​ క్యాప్​ గెలుచుకునే సత్తా ఉన్న టాప్​​-5 బ్యాట్స్​మెన్​పై ఓ లుక్కేద్దాం.

విరాట్​ కోహ్లీ

ఈ ఏడాది ఎలాగైనా సరే టైటిల్​ను గెలవాలని పరితపిస్తున్న ఫ్రాంచైజీల్లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఒకటి. ఆ జట్టు కెప్టెన్​​ కోహ్లీ ఆట గురించి ప్రతి​ అభిమానికి తెలుసు. గత మూడేళ్లుగా ఆర్సీబీ, పాయింట్ల పట్టికలో చివర్లో నిలుస్తున్నప్పటికీ, విరాట్ మాత్రం తన వ్యక్తిగత ప్రదర్శనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాడు. ఐపీఎల్​లో అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సారథిగానే కాకుండా.. ప్రధాన బ్యాట్స్​మన్​గానూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరి ఈ సీజన్​లో ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

విరాట్​ కోహ్లీ

రోహిత్​ శర్మ

గడిచిన రెండు ఐపీఎల్​ సీజన్లలో రోహిత్​ శర్మ ప్రదర్శన అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అతడి అద్భుత బ్యాటింగ్​ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన వారిని ఇతడు కాస్త నిరాశే మిగిల్చాడు. కానీ ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్​లో, ప్రపంచకప్​లో తన బ్యాటింగ్​ విశ్వరూపం చూపించాడు. దీంతో ఈ సీజన్​లో రోహిత్ ఫామ్​పై ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కేఎల్​ రాహుల్​

గత సంవత్సరం బ్యాటింగ్​తో మ్యాజిక్​ చేసిన క్రికెటర్ కేఎల్​ రాహుల్​. టీమ్​ఇండియాలో ఇటీవలే కాలంలో రాహుల్​ అసాధారణ ఇన్నింగ్స్​ ఆడి.. ఈ ఏడాది ఐపీఎల్​లోనూ సత్తా చాటాలని చూస్తున్నాడు. గత రెండు సీజన్లలో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ తరఫున ఆడిన రాహుల్..​ 50కిపైగా సగటుతో జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా ఉన్నాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే ప్రస్తుత సీజన్​లో ఆరెంజ్​ క్యాప్​ దక్కించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.

కేఎల్​ రాహుల్​

డేవిడ్​ వార్నర్

గత సీజన్​లో బ్యాటింగ్​తో ప్రభంజనం సృష్టించాడు వార్నర్​. దీంతో ఇప్పుడూ అద్భుత ప్రదర్శన చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. గతేడాది వార్నర్​ 12 మ్యాచ్​ల్లో 692 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో నిలిచి, ఆరెంజ్​ క్యాప్​ సొంతం చేసుకున్నాడు. అంతకుముందు 2017లోనూ ఈ ఘనత సాధించాడు.

డేవిడ్​ వార్నర్​

జోస్ బట్లర్

2018లో రాజస్థాన్​ రాయల్స్​కు ఆడిన జోస్​ బట్లర్​.. అద్భుత ఇన్నింగ్స్​తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ ఏడాది 54.80 సగటుతో 548 పరుగులు చేశాడు. గతేడాది కేవలం 9 మ్యాచ్​ల్లో 311 పరుగులు చేసి రాజస్థాన్ కీలక ఆటగాడిగా మారాడు. గత సీజన్​లో మధ్యలోనే వెళ్లిపోయాడు కానీ ఈ సారి మాత్రం​ అన్ని మ్యాచ్​లు ఆడనున్నాడు.

ABOUT THE AUTHOR

...view details