దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కోహ్లీసేన. మొహాలి వేదికగా జరుగుతున్న ఈ పోరులో పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశముంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా...ఈ మ్యాచ్లో ఇరుజట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఊహించినట్లుగానే జట్టులో కేఎల్ రాహుల్కు చోటు దక్కలేదు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు.
జట్లు..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృణాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ.
క్వింటన్ డికాక్ (కెప్టెన్), డసెన్ (వైస్ కెప్టెన్), తంబే బావుమా, ఫార్చ్యూన్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, ఆన్రిచ్ నోర్టజే, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, రబాడ, తబ్రేజ్ షంశీ.