బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్న టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నాడు. ఇప్పుడు భారత్-పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలపై మాట్లాడాడు. దాయాదుల సమరానికి రెండు దేశాల ప్రధానుల అనుమతి తప్పక అవసరమని అన్నాడు.భారత్, పాక్ క్రికెట్ సంబంధాల పునరుద్ధరణపై విలేకరులకు ఈ విధంగా వివరణ ఇచ్చాడు.
"ఈ ప్రశ్న మీరు మోదీజీ, పాక్ ప్రధాన మంత్రిని అడగాలి. వారిద్దరి అనుమతి తీసుకోక తప్పదు. ఎందుకంటే అంతర్జాతీయ పర్యటనలు అన్నీ ప్రభుత్వ అనుమతులతోనే కొనసాగుతాయి. అందుకే మీరడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు" -సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్