తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత షూటర్ల సత్తా- 14కు చేరిన స్వర్ణాలు

ఐఎస్​ఎస్​ఎఫ్ వరల్డ్​కప్​లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. తాజాగా జరిగిన పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషియన్ రైఫిల్ టీం​ విభాగంలో స్వర్ణ పతకం దక్కింది. తాజా మెడల్​తో మొత్తం స్వర్ణ పతకాల సంఖ్య 14కి చేరింది.

India's Swapnil Kusale, Chain Singh and Niraj Kumar clinch men's team gold in 50m rifle 3 positions event of shooting World Cup.
సత్తా చాటుతున్న షూటర్లు.. భారత ఖాతాలో మరో స్వర్ణం

By

Published : Mar 26, 2021, 4:10 PM IST

దిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్​ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​లో భారత్​ పతకాల వేట కొనసాగిస్తుంది. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషియన్ రైఫిల్ టీం​ విభాగంలో నీరజ్​ కుమార్, స్వాప్నిల్​ కుసాలే, చైన్​ సింగ్​లతో కూడిన షూటర్లు..​ బంగారు పతకం సాధించారు. తాజా స్వర్ణంతో మొత్తం బంగారు పతకాల సంఖ్య 14కి చేరింది. ఫైనల్​ ప్రత్యర్థి అమెరికా షూటర్లు నికోలస్​ మొవర్, టిమొతి శెర్రి, పాట్రిక్ సుందర్​మన్​పై 47-25తో గెలుపొందింది భారత్​.

ఈ మ్యాచ్​ హంగేరీతో జరగాల్సి ఉండగా చివరి క్షణంలో అది రద్దయింది. ఈ విభాగంలో రెండో స్థానంలో ఉన్న హంగేరీ షూటర్లు ఇస్వావన్ పెని, పీటర్​ సిడి మధ్య వివాదం నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంది. దీంతో మూడో స్థానంలో ఉన్న యూఎస్​ ఫైనల్లో భారత్​తో తలపడింది.

ఇదీ చదవండి:షూటింగ్ ప్రపంచకప్​లో మనకు మరో స్వర్ణం

ABOUT THE AUTHOR

...view details