బ్రిస్బేన్ టీమ్ఇండియాతో జరగబోయే నాలుగో(చివరి) టెస్టులో తమ జట్టుదే పైచేయి అవుతుందని ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మైదానంలో ఆడిన మ్యాచుల్లో తమ జట్టు గెలిచిన సందర్భాలను గుర్తుచేసుకున్నాడు. ఈ సారి అదే సెంటిమెంట్ కొనసాగుతుందని చెప్పాడు.
మరోవైపు ఈ మ్యాచ్కు ముందే టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విహారి, జడేజా గాయాలతో దూరమయ్యారు. ఇదీ తమ జట్టుకు కలిసొస్తుందని పాంటింగ్ చెప్పాడు. కాబట్టి చివరి మ్యాచులో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
"బ్రిస్బేన్లో ఆసీస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గబ్బా రికార్డు చూస్తే ఇది అర్థమవుతుంది. గాయపడిన పకోస్కీ కోలుకుంటే జట్టులో ఎలాంటి మార్పులు ఉండవు. ఒకవేళ అతడు అందుబాటులో లేకపోతే వేరొకరు ఆ స్థానంలో ఆడతారు. అదొక్కటే మార్పు. మొత్తం మీద మా జట్టు ఆధిపత్యం చెలాయించడం ఖాయం. కానీ టీమ్ఇండియా ఆటగాళ్లు గాయాల వల్ల దూరమయ్యారు. ఇది మాకు కలిసొస్తుంది"