కరోనా వల్ల బీసీసీఐ ఖర్చులను తగ్గించుకునే చర్యలను చేపట్టింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్ ఛాంపియన్స్ ప్రైజ్ మనీలో యాభై శాతం కోత విధించనుంది. గతేడాదితో పోలిస్తే నగదు బహుమతి సగానికి తగ్గించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చినట్లు బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.
ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా నగదు బహుమతులను సవరించినట్లు బీసీసీఐ తన నోటిఫికేషన్లో తెలిపింది. ఈ సీజన్ ఛాంపియన్స్‌కు ఇచ్చే రూ.20 కోట్లను రూ.10 కోట్లకు కుదించింది. రన్నరప్ ప్రైజ్‌మనీని 12.5 కోట్ల నుంచి రూ.6.25 కోట్లకు తగ్గించింది. క్వాలిఫయర్స్‌లో ఓటమి పాలైన రెండు జట్లకు రూ. 4.375 కోట్లు ఇవ్వనుంది.