తిరువనంతపురం వేదిగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్.. 8 వికెట్ల తేడాతో ఓటిమిపాలైంది. టీమిండియా బ్యాటింగ్‌లో ఆల్‌రౌండర్ శివమ్ దూబే (54) మినహా మిగిలినవారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో కోహ్లీ రాకుండా దూబే వచ్చాడు. తొలుత నిదానంగా ఆడిన ఈ యువ క్రికెటర్... తర్వాత సిక్సర్లు, బౌండరీలతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం దూబేని వన్‌డౌన్‌లో పంపించడానికి గల కారణం వెల్లడించాడు కోహ్లీ.
" పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలుసు. బ్యాటింగ్ ఆర్డర్‌లో దూబే ముందుకు వెళ్లి స్పిన్నర్లపై దాడికి దిగాలని భావించాం. అందుకే అతడిని వన్‌డౌన్‌లో పంపించాం. మా ప్రణాళిక ఫలించింది. అతడు బాగా ఆడటం వల్లే మంచి స్కోరు సాధించగలిగాం".
--విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
రెండు మ్యాచుల్లోనూ జట్టు ఫీల్డింగ్ నిరాశపర్చినట్లు తెలిపాడు కోహ్లీ. ఈ లోపాల వల్లే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుందని చెప్పాడు.
కోహ్లీ ఒక్కడే...
సహచరులంతా పేలవ ఫీల్డింగ్ చేస్తున్నా కోహ్లీ మాత్రం కళ్లుచెదిరే క్యాచ్‌తో అందరి మన్ననలు పొందాడు. ఒకానొక సమయంలో మ్యాచ్ చేజారిపోతుందనగా.. అద్భుతమైన క్యాచ్‌తో భారత్‌ను మళ్లీ పోటీలోకి తెచ్చాడు. జడేజా బౌలింగ్‌లో హెట్‌మెయిర్ రెండు వరుస సిక్సర్లు బాది హ్యాట్రిక్ సిక్సర్ కోసం లాంగాఫ్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. దూరం నుంచి మెరుపు వేగంతో దూసుకొచ్చిన కోహ్..లీ డైవ్ చేస్తూ అద్భుతమైన రీతిలో క్యాచ్ పట్టాడు. బంతిని అందుకున్నాక బౌండరీ లైన్‌కు తాకకుండా అతడు నియంత్రించుకున్న తీరుకు ఎవరైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ డిసెంబర్ 11న ముంబయిలో జరగనుంది. సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి.