తెలంగాణ

telangana

ETV Bharat / sports

బ్యాట్స్​మెన్ రాణించాలి:ధావన్ - దిల్లీ క్యాపిటల్స్

ఈ ఏడాది జరిగే ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నాడు శిఖర్ ధావన్. జట్టులోని తొలి ఐదుగురు బ్యాట్స్​మెన్ రాణిస్తే కప్పు కొట్టే అవకాశం ఉందంటున్నాడు.

దిల్లీ క్యాపిటల్స్ జట్టులో తొలి ఐదుగురు బ్యాట్స్​మెన్ రాణిస్తే చాలంటున్న శిఖర్ ధావన్

By

Published : Mar 18, 2019, 6:42 PM IST

Updated : Mar 19, 2019, 8:01 PM IST

దిల్లీ క్యాపిటల్స్ జట్టులోని భారత బ్యాట్స్​మెన్ రాణించాలని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కప్పు కొట్టాలంటే అది తప్పనిసరని తెలిపాడు.

ఈ మధ్య ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​లో పాల్గొన్నాడీ బ్యాట్స్​మెన్. దిల్లీ జట్టుతో కలిసి ఆదివారం జరిగిన ప్రాక్టీస్​లో సెషన్​లో కాసేపు బ్యాటింగ్ చేశాడు.

"ఐపీఎల్​లో సమతూకంతో ఉన్న జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. ఈ ఏడాది మా జట్టులో స్పిన్నర్స్, ఆల్​రౌండర్స్, బ్యాట్స్​మెన్ ఇలా అన్ని విభాగాలు మెరుగ్గా ఉన్నాయి. జట్టులో టాప్ 5లో ఆడేవారందరూ భారత బ్యాట్స్​మెన్ కావడం కలిసొచ్చే అంశం. దిల్లీ జట్టుకు ఆడేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచుస్తున్నాను. 10 సీజన్ల తర్వాత సొంత జట్టుకు ఆడటం ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోంది."
-ధావన్, దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్​మెన్

దిల్లీ జట్టుకు ఆడకముందు గత పది సీజన్లలో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించాడీ లెఫ్ట్ హాండ్ బ్యాట్స్​మెన్.

Last Updated : Mar 19, 2019, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details