వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళలు ఘన విజయం సాధించారు. 53 పరుగుల తేడాతో గెలిచిన మిథాలీసేన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. వన్డేల్లో 150 విజయాల మైలురాయిని అందుకుంది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తర్వాత నిలిచింది.
ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 50 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియా పునియా(5), రోడ్రిగ్స్(0) ఆదిలోనే నిరాశపరిచినా.. పూనమ్ రౌత్ (77), మిథాలి రాజ్ (40), హర్మన్‌ప్రీత్ కౌర్(46) ఆదుకున్నారు. ఫలితంగా టీమిండియా నామమాత్రపు స్కోర్ చేసింది.