తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో టీ20: విండీస్​ లక్ష్యం 168 పరుగులు - లాడర్ హిల్

వెస్టిండీస్​తో రెండో టీ20లో మెరుగ్గా రాణించిన కోహ్లీసేన.. ప్రత్యర్థికి 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ 67 పరుగులతో ఆకట్టుకున్నాడు.

రెండో టీట్వంటీ: విండీస్​ లక్ష్యం 168 పరుగులు

By

Published : Aug 4, 2019, 9:56 PM IST

లాడర్​హిల్ వేదికగా జరుగుతున్న రెండో టీట్వంటీలో నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది టీమిండియా. ఓపెనర్​ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ(67)తో మెరిశాడు. మిగతా బ్యాట్స్​మెన్ ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు.

అర్ధ శతకంతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ

తొలి వికెట్​కు 67 పరుగుల జోడించిన అనంతరం.. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధావన్ తొలి వికెట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ.. 28 పరుగులు చేసి ఔటయ్యాడు.

మరోసారి నిరాశపర్చిన పంత్ 4 పరుగులే చేశాడు. మనీశ్ పాండే 6, జడేజా 9, కృనాల్ పాండ్య 20 పరుగులు చేశారు.

విండీస్ బౌలర్లలో థామస్, కాట్రెల్ తలో రెండు వికెట్లు తీశారు. కీమో పాల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

ఇది చదవండి: సైనీ ఓ మంచి పేసర్​... భవిష్యత్​ స్టార్​: కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details