తెలంగాణ

telangana

ETV Bharat / sports

దంచికొట్టిన రోహిత్.. కివీస్ లక్ష్యం 180 - cricket live

మూడో టీ20లో తొలుత బ్యాటింగ్​ చేసిన కోహ్లీసేన.. ప్రత్యర్థి న్యూజిలాండ్​కు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

దంచికొట్టిన రోహిత్.. కివీస్ లక్ష్యం 186
రోహిత్ శర్మ

By

Published : Jan 29, 2020, 1:59 PM IST

Updated : Feb 28, 2020, 9:48 AM IST

హామిల్టన్​లో జరుగుతున్న మూడో టీ20లో భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గత రెండు మ్యాచ్​ల్లో విఫలమైన ఓపెనర్​ రోహిత్ శర్మ.. అర్ధ శతకంతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే రాహుల్​తో కలిసి తొలి వికెట్​కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఉన్నంతసేపు బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న రోహిత్.. 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెన్నెట్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు.

మిగతా వారిలో రాహుల్ 27, శివమ్ దూబే 3, కోహ్లీ 38, శ్రేయస్ అయ్యర్ 17, జడేజా 10, మనీశ్ పాండే 14 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో బెన్నెట్​ మూడు వికెట్లు తీయగా, గ్రాండ్​హోమ్, శాంట్నర్ తలో వికెట్​ పడగొట్టారు.

Last Updated : Feb 28, 2020, 9:48 AM IST

ABOUT THE AUTHOR

...view details