వెల్లింగ్టన్లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేశారు. మనీశ్ పాండే 50*,రాహుల్ 39 మాత్రమే రాణించారు. మిగతా వారు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.
భారత్ బ్యాట్స్‌మెన్ తడబాటు.. కివీస్ లక్ష్యం 166 - sports news
నాలుగో టీ20లో భారత్.. కివీస్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మనీశ్ పాండే అర్ధ శతకంతో రాణించాడు. ఇప్పటికే 3-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది కోహ్లీసేన.
విరాట్ కోహ్లీ
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 14 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్.. కేవలం 8 పరుగులే చేసి, మరోసారి తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీ 11, అయ్యర్ 1, దూబే 12, సుందర్ 0, శార్దుల్ 20, చాహల్ 1, సైనీ 11 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో సోధీ 3, బెన్నెట్ 2, కుగ్లిజన్, శాంటర్న్ తలో వికెట్ పడగొట్టారు.
Last Updated : Feb 28, 2020, 3:51 PM IST