టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో తలపడే మ్యాచులో మరో 46 పరుగులు చేస్తే 9000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అత్యంత వేగంగా దీనిని సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ, బ్రియన్ లారా వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టనున్నాడు.
ప్రస్తుతం రోహిత్ 215 ఇన్నింగ్సుల్లో 8,954 పరుగులతో ఉన్నాడు. 9000 మైలురాయిని అందుకొనేందుకు గంగూలీ 228, సచిన్ 235, లారా 239 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. రాజ్‌కోట్‌లో గనక హిట్‌మ్యాన్ ఆ 46 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ (194), ఏబీ డివిలియర్స్ (205) తర్వాతి స్థానంలో నిలుస్తాడు.
>> రాజ్‌కోట్‌లో రోహిత్ శతకం బాదితే వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం అతడు 28 సెంచరీలతో సనత్ జయసూర్య సరసన ఉన్నాడు.