తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ లక్ష్యం 161

ఓపెనర్ బేమౌంట్ అర్థశతకంతో రాణించగా, చివర్లో వరుస బౌండరీలతో మెరుపులు మెరిపించింది ఇంగ్లీష్ కెప్టెన్ హెథర్ నైట్.

By

Published : Mar 4, 2019, 12:35 PM IST

Updated : Mar 5, 2019, 12:40 AM IST

మహిళలు

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మహిళల టీ 20లో ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. అసోం గువహటి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో భారత్ టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బేమౌంట్ అర్థశతకంతో రాణించగా మరో ఓపెనర్ వ్యాట్ 35 పరుగులతో ఆకట్టుకుంది. వీరిద్దరూ తొలి వికెట్​కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. వ్యాట్​ని ఔట్​చేసి శిఖాపాండే ఈ జంటను విడదీసింది. రాధ రెండు వికెట్లు తీయగా, దీప్తి ఓ వికెట్ తన ఖాతాలో వేసుకుంది.

కాసేపటికే వన్డౌన్ బ్యాట్స్​ఉమన్ నటాలీ రాధ బౌలింగ్​లో ఔట్​ అవ్వగా ఇంగ్లీష్ కెప్టెన్ హెథర్ నైట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడింది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న బేమౌంట్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును ముందుకు కదిలించింది. వ్యాట్​తో కలిసి విలువైన భాగస్వామ్యన్ని నమోదు చేసింది.

చివర్లో మెరుపులు..
కెప్టెన్ హెథర్ నైట్​ ధాటిగా ఆడి జట్టుకు భారీ స్కోరును అందించింది. అరుంధతి రెడ్డి వేసిన 18ఓవర్లో వరసగా 5 ఫోర్లు కొట్టి చివర్లో మెరుపులు మెరిపించింది హెథర్. 20 బంతుల్లో 40 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్​లో ఔటైంది. చివరి మూడు ఓవర్లలో 37 పరుగులు రాబట్టుకుంది ఇంగ్లీష్ జట్టు.

Last Updated : Mar 5, 2019, 12:40 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details