తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ -కివీస్​ మ్యాచ్​ వర్షార్పణం

న్యూజిలాండ్​తో టీమిండియా రసవత్తర పోరుకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. మైదానంలో ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. ఈ కారణంతో మ్యాచ్​ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అంపైర్లు. జూన్​ 16న తదుపరి మ్యాచ్​లో పాక్​తో తలపడనుంది కోహ్లీ సేన.

టీమిండియా-కివీస్​ మ్యాచ్​ వర్షార్పణం

By

Published : Jun 13, 2019, 8:22 PM IST

నాటింగ్​హామ్​ వేదికగా జరగాల్సిన భారత్​- న్యూజిలాండ్​ మ్యాచ్​ రద్దయింది. ఎడతెరపి లేని వర్షం కారణంగా చాలా సేపు నిరీక్షించిన అంపైర్లు చివరికి మ్యాచ్​ను రద్దు చేశారు. వరుణుడి ప్రతాపంతో కనీసం టాస్​ వేసే అవకాశమూ రాలేదు. ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 5 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది కోహ్లీ సేన.

మైదానంలో నీటిని తోడుతున్న సిబ్బంది

జూన్​ 16న జరిగే తదుపరి మ్యాచ్​లో పాకిస్థాన్​తో తలపడనుంది భారత జట్టు. ఆడిన నాలుగింటిలో 3 మ్యాచ్​ల్లో ఓటమి పాలైంది పాక్​. ఆదివారం జరగనున్న ఈ పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇది చదవండి: క్రికెట్ ప్రపంచకప్​ ఫైనల్​పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జోస్యం

ABOUT THE AUTHOR

...view details