తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో టెస్టు: విజయానికి చేరువలో కోహ్లీ సేన

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో విజయానికి చేరువగా నిలిచింది టీమిండియా. నాలుగో రోజు లంచ్ సమయానికి రెండో ఇన్నింగ్స్​లో 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది సౌతాఫ్రికా.

మ్యాచ్

By

Published : Oct 13, 2019, 12:26 PM IST

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా గెలుపు దిశగా దూసుకెళ్తోంది. నాలుగో రోజు ఫాలో ఆన్​లో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా భోజన విరామానికి 27 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ప్రస్తుతం బవుమా (2), డికాక్‌ (1) క్రీజులో ఉన్నారు.

భళా సాహా

రెండో ఇన్నింగ్స్​లో రెండు అద్భుత క్యాచ్‌లతో అదరగొట్టాడు సాహా. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో లెగ్‌సైడ్‌ వెళ్లిన ఓ బంతిని డిబ్రుయిన్‌(8) షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన సాహా అమాంతం డైవ్‌చేసి అతడి క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత 24వ ఓవర్‌లో కెప్టెన్‌ డుప్లెసిస్‌(5; 54 బంతుల్లో)ను పెవిలియన్‌కు పంపాడు. అశ్విన్‌ వేసిన ఓ బంతి కెప్టెన్‌ బ్యాట్‌కు తగిలి నేరుగా కీపర్‌ చేతిలోకి వెళ్లింది. అయితే బంతిని అందుకోవడంలో తడబడిన సాహా.. రెండు సార్లు మిస్‌ అయినా మూడోసారి ముందుకు డైవ్‌ చేసి అందుకున్నాడు.

ఇవీ చూడండి.. కళ్లు చెదిరే క్యాచ్​లు అందుకొన్న కోహ్లీ, సాహా..!

ABOUT THE AUTHOR

...view details