క్వారంటైన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు భారత సారథి విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్తో కొద్ది రోజుల్లో టెస్టు సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. హోటల్ గదిలోనే చెమటలు చిందిస్తున్నాడు. ఈ మేరకు తన వర్క్ఔట్స్కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.
"క్వారంటైన్లో కావాల్సిందల్లా మంచి సంగీతం, జిమ్ పరికరాలు. మీరు నిజంగా వర్క్ఔట్స్ చేయాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా."
-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్