తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో టీ20లకు నటరాజన్​ దూరం!

ఇంగ్లాండ్​తో పొట్టి సిరీస్​లో భారత యువ బౌలర్​ నటరాజన్ ఆడేది అనుమానంగా మారింది. మోకాలితో పాటు భుజం గాయంతో అతడు బాధపడుతున్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్​సీఏ) వర్గాలు వెల్లడించాయి.

Ind vs Eng: Knee and shoulder injury puts Natarajan in doubt for T20Is
ఇంగ్లాండ్​తో టీ20లకు నటరాజన్​ దూరం!

By

Published : Mar 10, 2021, 8:55 AM IST

భారత యువ బౌలర్​ టి.నటరాజన్​ ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. మోకాలి, భుజం గాయాల కారణంగా అతడు సిరీస్​లో ఆడేది అనుమానంగా మారింది. గత ఆస్ట్రేలియా సిరీస్​లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు నట్టూ.

"నటరాజన్​ మోకాలి, భుజం గాయంతో బాధపడుతున్నాడు. అతడు ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​లో ఆడేది అనుమానంగా మారింది." అని జాతీయ క్రికెట్ అకాడమీ వర్గాలు వెల్లడించాయి.

మరో క్రికెటర్​ వరుణ్​ చక్రవర్తి కూడా ఈ సిరీస్​లో ఆడేది స్పష్టత లేదు. తప్పనిసరి ఫిట్​నెస్​ పరీక్షను వరుణ్​ అధిగమించలేకపోయాడు. దీంతో అతని స్థానంలో రాహుల్​ చాహర్​ను ఆడించే అవకాశం ఉంది. హార్దిక్​ పాండ్య సైతం టీ20లకు పూర్తి స్థాయిలో సన్నద్ధమని ప్రకటించాడు. అతడు బ్యాటింగ్​, బౌలింగ్ చేస్తున్న వీడియోను ట్విట్టర్​లో పోస్టు చేశాడు.

ఇదీ చదవండి:ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​ ఆడేందుకు సిద్ధం: హార్దిక్​

ABOUT THE AUTHOR

...view details