అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి డే/నైట్ టెస్టులో రవించంద్రన్ అశ్విన్ బంతిని సుడులు తిప్పుతూ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. స్మిత్ (1)ను తన తొలి ఓవర్‌లోనే ఔట్ చేసిన అతడు.. తర్వాత ట్రెవిస్ హెడ్ (7), కెమెరన్ గ్రీన్ (11)ను పెవిలియన్‌కు చేర్చి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో ఆసీస్ 79 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది.
దుమ్మురేపిన భారత బౌలర్లు.. ఆసీస్ 191 ఆలౌట్ - బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020
టీమ్ఇండియాతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 53 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లు విజృంభిచడం వల్ల ఆసీస్ 191 పరుగులకే ఆలౌటైంది.
దుమ్మురేపిన భారత బౌలర్లు.. ఆసీస్ 191 ఆలౌట్
కాసేపు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న లబుషేన్ (47)ను ఉమేశ్ యాదవ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ పైన్ (73) అద్భుత పోరాటం చేశాడు. కానీ అతడికి సహకారం అందించే వారు కరవవడం వల్ల ఆసీస్ 191 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 53 పరుగులు ఆధిక్యం లభించింది.
భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లతో సత్తాచాటగా ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా రెండు వికెట్లు దక్కించుకున్నారు.
Last Updated : Dec 18, 2020, 4:45 PM IST