బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగోటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడుతోంది టీమ్ఇండియా. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. చివరి రోజు ఆటలో తొలి సెషన్ పూర్తయ్యేసరికి వికెట్ కోల్పోయి 83 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ విజయానికి మరో 245 పరుగుల దూరంలో ఉంది.
గబ్బా టెస్టు: విజయానికి 245 పరుగుల దూరంలో భారత్ - aus vs ind fourt test
గబ్బా టెస్టులో టీమ్ఇండియా అదరగొడుతోంది. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉండగా.. విజయానికి 245 పరుగుల దూరంలో నిలిచింది. భోజన విరామానికి వికెట్ కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(64), పుజారా(8) ఉన్నారు.
రోహిత్
ఓవర్‌నైట్ స్కోరు 4/0తో ఐదో రోజు ఆటను కొనసాగించిన భారత్.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే తొలి వికెట్‌ను సమర్పించుకుంది. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద రోహిత్ శర్మ(7) తొలివికెట్‌గా వెనుదిరిగాడు. కమిన్స్ బౌలింగ్‌లో రోహిత్.. వికెట్ కీపర్‌కు చిక్కాడు. క్రీజులో గిల్(57), పుజారా(8) ఉన్నారు.