తెలంగాణ

telangana

ETV Bharat / sports

చివరి టెస్టుకు వర్షం ఆటంకం- ఆసీస్​ 243/7 - ఆసీస్​ రెండో ఇన్నింగ్స్​

భారత్‌తో జరుగుతున్న నాలుగో(చివరి) టెస్టు రెండో ఇన్నింగ్స్‌ టీ బ్రేక్​ సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది ఆసీస్​. ఫలితంగా 276 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో కమిన్స్​(2), స్టార్క్​(1) ఉన్నారు.

smith
స్మిత్​

By

Published : Jan 18, 2021, 10:21 AM IST

Updated : Jan 18, 2021, 10:32 AM IST

బ్రిస్బేన్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా దూకుడుగా ఆడుతోంది. ఏడు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. ఫలితంగా ​ 276 పరుగుల ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా.. నిర్ణీత సమయం కంటే ముందే అంపైర్లు టీ విరామం ఇచ్చారు. మబ్బుల వల్ల మైదానంలో ఓ వైపు వెలుతురు తక్కువగా ఉంది. దీంతో ఆటను నిలిపివేసి, పిచ్‌ను కవర్లతో కప్పారు.

రాణించిన బౌలర్లు..

భోజన విరామం తర్వాత ఆసీస్​ అయిదో వికెట్ కోల్పోయింది. అర్ధశతకం సాధించిన స్టార్ బ్యాట్స్‌‌మన్‌ స్టీవ్‌ స్మిత్ (55)ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. బౌన్సర్‌ అంచనా వేయడంలో విఫలమైన స్మిత్ రహానె చేతికి చిక్కాడు. ఆ తర్వాత గ్రీన్‌ (37) ఆరో వికెట్​గా శార్దుల్ ఠాకూర్‌ బౌలింగ్​లో రోహిత్​ చేతికి చిక్కాడు. అనంతరం టిమ్​ పైన్​(27) ఏడో వికెట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో కమిన్స్​(2), స్టార్క్​(1) ఉన్నారు.

Last Updated : Jan 18, 2021, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details