తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒకే రోజు.. 309 పరుగులు.. టీమ్​ఇండియా లక్ష్యం! - ఇండియా vs ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ 3

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా బ్యాట్స్​మన్​ నిలకడగా రాణిస్తున్నారు. రోహిత్​ శర్మ అర్ధశతకం చేసి వెనుదిరిగినా.. పుజారా, రహానె ఆచితూచి ఆడుతున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్​ కంటే భారత జట్టు 309 పరుగులు వెనుకబడి ఉంది.

IND vs AUS 3rd Test: Rohit Sharma Falls After Reaching Fifty, India 2 Down
ఒకే రోజు.. 309 పరుగులు.. టీమ్​ఇండియా లక్ష్యం!

By

Published : Jan 10, 2021, 12:48 PM IST

Updated : Jan 10, 2021, 2:36 PM IST

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా గెలవాలంటే ఇంకా 309 పరుగులు చెయ్యాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(9), రహానె(4) ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓపెనర్లు రోహిత్‌ శర్మ(52), శుభ్‌మన్‌గిల్‌(31) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు.

ఈ క్రమంలోనే హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో గిల్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై పుజారా క్రీజులోకి రావడం వల్ల కాసేపటికే రోహిత్‌ అర్ధశతకం సాధించాడు. 30వ ఓవర్‌లో లియోన్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన హిట్‌మ్యాన్‌ విదేశాల్లో టెస్టు ఓపెనర్‌గా తొలి అర్ధశతకం నమోదు చేశాడు. ఇక తర్వాతి ఓవర్‌లోనే కమిన్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్‌ వద్ద స్టార్క్‌ చేతికి చిక్కాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 92/2గా నమోదైంది.
ఇదీ చూడండి:భారత్​కు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణ

Last Updated : Jan 10, 2021, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details