'గేమ్ చేంజర్' ఆత్మకథతో వివాదాలకు కేంద్రబిందువుగా మారిన పాక్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జావెద్ మియాందాద్, వకార్ యూనిస్, గౌతమ్ గంభీర్ వంటి ప్రముఖులు ఇతడిపై పలు ఆరోపణలు చేశారు. తాజాగా ఆ దేశ మాజీ ఆటగాడు ఇమ్రాన్ ఫర్హాత్ అఫ్రిదీపై మండిపడ్డాడు.
"తన వయసు విషయంలో 20 ఏళ్లపాటు అబద్ధం చెప్పాడు. అలాంటి వ్యక్తి ప్రముఖ క్రికెటర్లను నిందించడం సరికాదు. అఫ్రిదీ ఆటో బయోగ్రఫీ చదివి, విని, చాలా విషయాలు తెలుసుకున్నా. అందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. 20 ఏళ్లపాటు తన వయసును దాచిపెట్టి ఇప్పుడు మంచివాడిగా ఇతరులను నిందిస్తున్నాడు. రాజకీయవేత్త అయ్యేందుకు అఫ్రిదీకి మంచి నైపుణ్యం ఉంది. అతడి చేతిలో మోసపోయిన చాలా మంది ఆటగాళ్లు బయటకు వచ్చి వారికి జరిగిన అన్యాయాన్ని వెల్లడించాలి. తన స్వార్ధం కోసం ఎంతో మంది కెరీర్‌లను నాశనం చేశాడు"