ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడితే, తమకు పని సులభమవుతుందని చెప్పాడు టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్. అతడిని చాలా మిస్సవుతున్నానని, రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఓ క్రీడా వెబ్‌సైట్‌తో ఇటీవలే జరిగిన లైవ్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాల్ని వెల్లడించాడు.
"ధోనీని చాలా మిస్సవుతున్నా. రిటైర్మెంట్ విషయం గురించి ఇక్కడ చర్చ అనవసరం. ఎప్పుడు ఏం చేయాలో అతడికి తెలుసు. వ్యక్తిగతంగా, అతడు మళ్లీ టీమిండియా తరఫున ఆడితే బాగుంటుందని అభిప్రాయం. అతడు జట్టులోకి వస్తే మాకు పని సులభమవుతుంది" -కుల్దీప్ యాదవ్, భారత స్పిన్నర్