"ఎవరి కర్మకు వారే బాధ్యులు".. భారత సంప్రదాయంలో ఎక్కువ మంది ఈ సిద్ధాంతాన్ని విశ్వసిస్తుంటారు. ఇప్పుడు ఈ 'కర్మ' అనే పదాన్ని విపులీకరించి ట్విట్టర్లో షేర్ చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). స్టీవ్ స్మిత్‌కు వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్న ఇంగ్లాండ్ అభిమానులను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టింది.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్టులో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌కు వస్తున్నపుడు ఓ వ్యక్తి స్మిత్ ఏడుస్తున్న ఫొటోను మాస్క్‌లా ధరించి నిరసన వ్యక్తం చేశాడు. ఈ చిత్రాన్ని ఐసీసీ షేర్ చేసింది.
"కర్మ అంటే.. హిందూ, బౌద్ధ మత సంప్రదాయాల ప్రకారం మనిషి చేసిన పనులు అతడి కర్మానుసారం పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తర్వాతి జన్మకైనా.. అనుభవించే వరకు వదలదు" -ఐసీసీ ట్వీట్