శ్రీలంక క్రికెట్ బోర్డుకు చెందిన ఇద్దరు రక్షణ అధికారుల బృందం బుధవారం పాకిస్థాన్ సందర్శించనున్నారు. అక్టోబర్‌లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పాక్‌లో పర్యటించనుంది లంక. ఈ మేరకు పాక్‌లో పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లనుంది లంక రక్షణ బృందం. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ ప్రాంతాల్లో మైదానాలు, హొటళ్లను పరిశీలించనున్నారు లంక అధికారులు.
పాకిస్థాన్‌కు శ్రీలంక కికెటర్ల రక్షణ విభాగం! - srilanka
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పాకిస్థాన్‌ను సందర్శించనుంది శ్రీలంక క్రికెటర్ల రక్షణ బృందం. అక్టోబర్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడనున్న మ్యాచ్ కోసం పాక్‌లో పరిస్థితులను పరిశీలించనుంది.
పాకిస్థాన్
2009లో శ్రీలంక ఆటగాళ్లు వస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. లాహోర్‌లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పటి నుంచి టెస్టు అర్హత ఉన్న అగ్ర జట్లు పాకిస్థాన్‌లో పర్యటించట్లేదు.
ఇది చదవండి: ఇంగ్లాండ్‌కు అడ్డుగా స్మిత్... పోరాడుతున్న ఆసీస్