ఇంగ్లాండ్‌తో సిరీస్ అనంతరం టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది ఐసీసీ. 122 రేటింగ్ పాయింట్లతో టీమ్ఇండియా నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
స్వదేశంలో.. ఇంగ్లాండ్‌ను 3-1తో చిత్తు చేసింది భారత్. చివరి టెస్టులో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓడించింది. అశ్విన్, అక్షర్ రెండో ఇన్నింగ్స్‌లో చెరో 5 వికెట్లతో చెలరేగారు. 4 మ్యాచ్‌ల్లో మొత్తం 32 వికెట్లు తీసిన అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. పంత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.