ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రోహిత్, కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను పదిల పరుచుకున్నారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఐదు శతకాలు చేసిన హిట్ మ్యాన్ మొదటి ర్యాంకుకు అడుగు దూరంలో నిలిచాడు.
- ఈ మెగాటోర్నీలో వరుసగా ఐదు అర్ధశతకాలు చేసిన విరాట్ కోహ్లీ 891 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో 63.04 సగటుతో 442 పరుగులు చేశాడు విరాట్. రోహిత్ 885 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ మూడో ర్యాంక్‌కు ఎగబాకాడు. ఏడాది తర్వాత వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో 638 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్న వార్నర్... తాజా ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ 8వ ర్యాంకులో ఉన్నాడు.
- బౌలింగ్ విభాగంలో భారత పేసర్ బుమ్రా తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో 9మ్యాచ్‌ల్లో బరిలోకి దిగి 17 వికెట్లు తీశాడు బుమ్రా.