ఐసీసీ పురుషుల ప్రపంచకప్ లీగ్-2 క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందులో నమీబియా, నేపాల్, ఒమన్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్, యూఏఈ, అమెరికా వంటి ఏడు జట్లు పాల్గొంటాయి. 21 ట్రై సిరీస్‌లలో భాగంగా 126 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.
రెండున్నరేళ్ల కాలంలో ప్రతి జట్టు 36 వన్డేలు ఆడుతుంది. ఆగస్టు 14 నుంచి జనవరి 2022 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
- లీగ్-2 ఆరంభ మ్యాచ్‌లు స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ జట్ల మధ్య ఆగస్టు 14 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ సిరీస్‌లో ప్రతి జట్టు నాలుగు వన్డేలు ఆడుతుంది. ప్రతి మ్యాచ్‌కు రెండు పాయింట్లు కేటాయించారు. ఈ పాయింట్ల ఆధారంగా సీడబ్ల్యూసీ లీగ్-2 పట్టిక ఉంటుంది.
- 21 త్రైపాక్షిక సిరీస్‌ల తర్వాత మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లను ప్రపంచకప్ క్వాలిఫయర్-2022 జట్లుగా ప్రకటిస్తారు. పట్టికలో చివరన ఉన్న జట్లకు క్వాలిఫయర్ ప్లేఆఫ్-2022లో స్థానం ఉండదు. 2022 క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు 2023 ప్రపంచకప్‌లో ఆడేందుకు అర్హత సాధిస్తాయి.
ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్-2 సిరీస్
- ఆగస్ట్ 14: ఒమన్ వర్సెస్ పపువా న్యూగినియా- మ్యాన్‌ఫోల్డ్ పార్క్, అబెర్డీన్
- ఆగస్ట్ 15: స్కాట్లాండ్ వర్సెస్ ఒమన్- మ్యాన్‌ఫోల్డ్ పార్క్, అబెర్డీన్
- ఆగస్ట్ 17:స్కాట్లాండ్ వర్సెస్ పపువా న్యూగినియా - మ్యాన్‌ఫోల్డ్ పార్క్, అబెర్డీన్
- ఆగస్ట్ 18:స్కాట్లాండ్ వర్సెస్ ఒమన్- మ్యాన్‌ఫోల్డ్ పార్క్, అబెర్డీన్
- ఆగస్ట్ 20: స్కాట్లాండ్ వర్సెస్ పపువా న్యూగినియా - మ్యాన్‌ఫోల్డ్ పార్క్, అబెర్డీన్
- ఆగస్ట్ 21: ఒమన్ వర్సెస్ పపువా న్యూగినియా- మ్యాన్‌ఫోల్డ్ పార్క్, అబెర్డీన్
2023 ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ పోటీలు 2022లో జరగనున్నాయి. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2, వరల్డ్‌కప్ ఛాలెంజ్ లీగ్ టోర్నీల్లో సత్తాచాటిన జట్లు 2022లో జరిగే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ పోటీలకు అర్హతసాధిస్తాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2..
ఇందులో ఏడు జట్లు పాల్గొననున్నాయి. నేపాల్, స్కాట్లాండ్, యూఏఈ జట్లతో పాటు 2019 వరల్డ్క్రికెట్ లీగ్ డివిజన్-2లో టాప్-4లో నిలిచిన ఒమన్, నమీబియా, యూఎస్ఏ, పపువా న్యూ గినియా దేశాలు ఇందులో పోటీపడతాయి. ఈ టోర్నీలో టాప్-3లో నిలిచిన జట్లు 2023 వరల్డ్‌కప్ క్వాలిఫైయింగ్ పోటీలకు ఎంపికవుతాయి. మిగిలిన జట్లు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తాయి.
ఛాలెంజ్ లీగ్...
వరల్డ్ క్రికెట్ లీగ్‌లో 21 నుంచి 32 ర్యాంకింగ్స్ మధ్య ఉన్న జట్లకు ఈ పోటీలు నిర్వహిస్తారు. టాప్-2లో నిలిచిన దేశాలు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తాయి.