2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్పుల్లో భాగమయ్యాడు యువరాజ్ సింగ్. ప్రస్తుతం ఫామ్ లేమితో భారత జట్టులో స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో అర్ధశతకం చేసి ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా రిటైర్మెంట్తో పాటు పలు విషయాలు పంచుకున్నాడు.
ఆటకు వీడ్కోలు పలికే ఆలోచన వస్తే ముందు తానే తప్పుకుంటానని తెలిపాడు యువరాజ్. రెండేళ్లుగా తన కెరీర్ ఒడుదొడుకుల్లో ఉందని అన్నాడు. రిటైర్మెంట్ గురించి ప్రస్తుతం ఆలోచించట్లేదని చెప్పాడు ఈ 37 ఏళ్ల క్రికెటర్.
"ప్రస్తుతం ఆటను ఆస్వాదిస్తున్నా. జాతీయ జట్టులోకి రావడం గురించి ఆలోచించట్లేదు. ఇలాంటి పరిస్థితినే సచిన్ ఎదుర్కొన్నాడు. అతడితో మాట్లాడితే కొంచెం మనసు తేలిక పడుతుంది"
యువరాజ్ సింగ్, క్రికెటర్