తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాంటింగ్​తో అశ్విన్​ చర్చలు .. ఎందుకోసమంటే?

క్రికెట్​లో మన్కడింగ్​ పద్దతిపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే దిల్లీ క్యాపిటల్స్​ కోచ్​ రికీ పాంటింగ్​తో చర్చలు జరిపినట్లు జట్టు బౌలర్​ అశ్విన్​ తెలిపాడు. వచ్చే వారం వివరాలను వెల్లడిస్తానని తెలిపాడు.

Ashwin
అశ్విన్

By

Published : Aug 25, 2020, 4:17 PM IST

బంతి వేయకముందే క్రీజు దాటిన బ్యాట్స్​మన్​ను ఔట్​ చేసే వివాదాస్పద సమస్యపై.. తన ఐపీఎల్​ కోచ్​ రికీ పాంటింగ్​తో సంభాషించినట్లు టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ తెలిపాడు. టెలిఫోన్​ కాన్ఫరెన్స్​ ద్వారా చర్చించిన ఈ వివరాలను వచ్చే వారం వెల్లడిస్తానని పేర్కొన్నాడు. యూఏఈలో లీగ్​ నిర్వహణకు ముందు మన్కడింగ్​ పద్దతిపై పాంటింగ్​ స్పందిస్తూ.. అశ్విన్​తో ఈ వివాదాస్పద పద్దతిపై చర్చిస్తామని చెప్పాడు. దీంతో ఈ విషయం చర్చనీయాశంగా మారింది.

గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ జాస్‌ బట్లర్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సారథిగా ఉన్న అశ్విన్‌ మన్కడింగ్‌ చేశాడు. మైదానంలోనే బట్లర్‌ దీనిపై అసహనం వ్యక్తం చేశాడు. చాలామంది క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా పేర్కొన్నారు.

ఈ సీజన్​లో అశ్విన్‌‌ దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడేందుకు దుబాయ్ చేరుకున్నాడు. పాంటింగ్​ వచ్చే వారం రానున్నాడు. ఇరువురి మధ్య జరిగిన సంభాషణను అశ్విన్ వివరించే ముందు.. వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకోనున్నారు.

మన్కడింగ్‌ చేసినప్పుడు బౌలర్‌కు 'ఫ్రీ బాల్‌' ఇస్తే బాగుంటుందని సోమవారం అశ్విన్‌ సూచించాడు. "అవును.. అప్పుడు బౌలర్‌కు ఫ్రీ బాల్‌ ఇవ్వండి. బంతి వేసేముందే బ్యాట్స్‌మన్‌ క్రీజు దాటితే బ్యాటింగ్‌ జట్టు నుంచి 5 పరుగులు తగ్గించాలి. ఫ్రీహిట్‌తో లాభమంతా బ్యాట్స్‌మన్‌కే కదా. అలాగే బౌలర్లకూ అవకాశం ఇవ్వండి" అని అశ్విన్​ కోరాడు.

ABOUT THE AUTHOR

...view details